Reading Time: < 1 minute

కాంతార చాప్టర్1 సినిమాలో రాజ కుమారి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించిన హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ భామ. తాజాగా రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కూడా రుక్మిణి ఎంపికైనట్టు సమాచారం.

ఇక శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రానున్న ఓ సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీలో మరో సీనియర్ హీరో నటించనున్నట్టు సమాచారం.