Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: శాసనసభ సమావేశాల ను హాజరుకాకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రానికి కీలకమైన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగాలని బిఎసి సమావేశంలో బిఆర్‌ఎస్ పట్టుబట్టిందని, తీరా ప్రభుత్వం చర్చ కు సిద్ధమైతే సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు భయపడి పారిపోయారని విమర్శించారు. వాళ్లకు ఇబ్బంది అనిపించిన రోజున వాకౌట్ చేశారంటే అర్థం ఉంది, కా నీ మిగతా రోజులు సభకు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అసెంబ్లీకి రాకుండా ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయ న మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. బిఆర్‌ఎస్ సభకు గైర్హాజరు కావడం, ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవడంపై ఆయన మండిపడ్డారు.

ఎక్కువ రోజులు సభ జరగాలని అడిగి పారిపోతారా..? అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను నిలదీశారు. సభలో జరిగి న పరిణామాలను ప్రభుత్వం గమనిస్తోందని, నిబంధన ల ప్రకారమే చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మా ర్పులు చేస్తూ రాష్ట్రాలపై భారం వేస్తుంటే, దానిపై చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం బిఆర్‌ఎస్‌కు ముఖ్యం కాదా..? అ ని అడిగారు. సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలి అనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం ప్రజా స మస్యలపై ఏ సమయంలోనైనా చర్చకు సిద్ధంగా ఉందని అన్నారు. బిఆర్‌ఎస్ తన వైఖరిని మార్చుకోవాలని భట్టి విక్రమార్క హితవు పలికారు. మండలిలో కవిత భావోద్వేగానికి గురికావడంపై స్పందిస్తూ.. ఆమె మాట్లాడిన ప్రతి మాట సభ రికార్డు అయిందని తెలిపారు.