
మన తెలంగాణ/హైదరాబాద్: త క్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ అ మాయక ప్రజలను బురిడీ కొట్టించి న సాహితీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేసులో సిసిఎస్ పోలీసులు చార్జిషీట్ దాఖ లు చేశారు. సుమారు రూ.3వేల కో ట్లు ఈ స్కాం ఉంటుందని నిర్ధారించిన పోలీసులు, కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత కో ర్టులో ఛార్జ్ షీట్ సమర్పించారు. సా హితీ ఇన్‌ఫ్రా చేపట్టిన నిర్మాణ ప్రాజెక్టుల్లో అమీన్‌పూర్‌లోని ‘శర్వాణి ఎలైట్’ ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. ఈ 17 కేసులకు సంబంధించి పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఒక్క శర్వాణి ఎలైట్ పేరుతోనే బాధితుల నుండి రూ. 500 కోట్ల పై చిలుకు వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ భారీ కుంభకోణంలో లక్ష్మీనారాయణ మాత్రమే కాకుండా, అతనికి సహకరించిన మొత్తం 13 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్ షీట్ సిద్దం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలతో చార్జిషీట్ సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, సాహితీ ఇన్‌ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారు.
తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ నమ్మబలికి వేల మంది బాధితుల నుండి డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసిన మొత్తాన్ని ప్రాజెక్టుల కోసం వినియోగించకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మొత్తం 64 కేసులు నమోదు కాగా, పోలీసులు అన్నింటిపై లోతుగా విచారణపై దృష్టిసారించారు. సాహితీ ఇన్‌ఫ్రా తొమ్మిది ప్రాజెక్టుల పేరుతో దాదాపు 3వేల 500 మంది నుండి డబ్బులు వసూలు చేసింది. అయితే, ఫ్రీ లాంచ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. తీసుకున్న డబ్బును బాధితులకు తిరిగి ఇవ్వలేదు. దీంతో 2022 ఆగస్టులో 240 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెదక్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి.