
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు దుర్మరణం పాల య్యారు. తీవ్ర గాయాలపాలైన వారి పిల్లలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్, ఆశ దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. కృష్ణకిశోర్ పదేళ్లకు పైగా అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వారు పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో దుబాయ్‌లో ఆగి న్యూ ఇయర్ వేడు కలు జరుపుకున్నారు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో కృష్ణ కిశోర్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
వాషిం గ్టన్‌లో కృష్ణ కిశోర్ కుటంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కృష్ణ కిశోర్, ఆశ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మర ణించారని అమెరికా పోలీసులు వెల్లడించారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయని, వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తు న్నామని పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణ కిశోర్ కుటుంబ సభ్యులకు అమెరికా పోలీసులు సమాచారం అందించారు. అయితే, కృష్ణ కిషోర్ – ఆశ దంప తుల మృతితో పాలకొల్లులో తీవ్ర శోక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, బంధువులు వారిని పరామర్శించి ఓదారుస్తున్నారు.