
వెనెజువెలాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్‌లో వారాంతం అయ్యేసరికి 32 మంది క్యూబా అధికారులు మృతి చెందారని క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. వెనెజువెలా ప్రభుత్వ అభ్యర్థనపై క్యూబా మిలిటరీ, పోలీస్ ఆఫీసర్లు కరేబియన్ కంటీ మిలిటరీ ఆపరేషన్‌లో ఉన్నారు. అయితే వీరు ఏం చేస్తుండేవారో తెలియడం లేదు. కానీ వెనెజువెలాకు అత్యంత సన్నిహితమైన క్యూబా వెనెజువెలా కోసం తమ సైనికులను, పోలీస్ అధికారులను గత కొన్నేళ్లుగా పంపిస్తోంది. 32 మంది అధికారుల మృతికి సంతాపంగా క్యూబా ప్రభుత్వం రెండు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, అధ్యక్షుడు మిగ్వేల్ డియాజ్ కెనెల్ సంతాప సందేశాలు పంపించారు. క్యూబా సైనికులు నిరంతరం వెనెజువెలా అధ్యక్షుడు మదురోకు రక్షకులుగా ఉండేవారని బయటపడింది. అమెరికా రక్షణ మంత్రి మార్కో రుబియో ఈ సందర్భంగా వెనెజువెలాలో క్యూబా ప్రమేయం వివరిస్తూ మదురో ఆంతరంగిక భద్రతాధికారులుగా క్యూబా అధికారలు ఉండేవారని పేర్కొన్నారు.