
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం యశ్వీర్‌సింగ్ అనే 25 ఏళ్ల వ్యక్తి తన తల్లి,చెల్లి, తమ్ముడిని దారుణంగా హత్యచేసి తరువాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఢిల్లీ లోని లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మంగల్‌బజార్ ఏరియాకు చెందిన యశ్వీర్ సింగ్ తానే ఆర్థిక సమస్యల కారణంగా తన తల్లి కవిత(46)ని, చెల్లి మేఘన(24)ని, తమ్ముడు ముకుల్ (14)ని హత్యచేశానని చెప్పాడు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి వెళ్లి ఇంట్లో ఉన్న మూడు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు పంపించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.