
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తరచూ ట్రంప్ ప్రసన్నతకు చేసిన కృషి అంతా నిష్ఫలమేనా ? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. రష్యా చమురు నిలిపివేయకపోతే భారత్‌పై వెంటనే భారీ సుంకాలు అని ట్రంప్ హెచ్చరించడంపై కాంగ్రెస్ తరఫున జై రాం రమేష్ స్పందించారు. నమస్తే ట్రంప్‌లు, కనబడగానే ఆలింగనాలు, హౌడి మోడీ వ్యవహారాలు, బలవంతపు కౌగిలింతలు ఇన్ని చేసినా పనికి రాలేదా? అని నిలదీశారు. వైట్‌హౌస్‌లోని ప్రధాని మోడీ ప్రియమైన స్నేహితుడు భారత్ పట్ల ఘాటుగా స్పందిస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న విషయం తిరిగి రుజువు అయిందని వ్యాఖ్యానించారు. పాపం మోడీ పాట్లు పనికి రాకుండా పొయ్యాయా? అని కాంగ్రెస్ నేత స్పందించారు.