Reading Time: < 1 minute

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్‌లో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో ఆంధ్రాకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్(45), ఆశ(40) అనే దంపతులు తన కుమారుడు, కూతురుతో కలిసి వెళ్తుండగా కారును మరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. కూతురు, కుమారుడు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కిశోర్ పది సంవత్సరాల క్రితం అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. ఈ కుటుంబం డిసెంబర్ నెలలో సొంతూరుకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. దుబాయ్‌లో కొత్త సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారు. దంపతుల మృతితో పాలకొల్లులో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.