Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ చేరికకు ముందే జాగృతిని స్థాపించానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలపారు. తెలంగాణ కోసం గల్లీలో కాదు, ఢిల్లీలోనూ కొట్లాడానని అన్నారు. ఈ సందర్భంగా సోమవారం శాసనమండలిలో ఆమె ప్రసంగించారు. 8 ఏళ్లు స్వతంత్ర సంస్థగా పనిచేశామని, ఆస్కార్ ఫెర్నాండేజ్ తో మాజీ సిఎం కెసిఆర్ కు మీటింగ్ ఏర్పాటు చేసింది తానేనని, తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చానని తెలియజేశారు. నిజామామాబాద్ ఎంపిగా నేను పోటీ చేస్తే అందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారని తనకు టికెట్ ఇచ్చారని, 8 ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారని కంటతడి పెట్టారు. పార్టీలో మౌత్ పీస్ గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు తనకు ఏనాడు మద్దతు ఇవ్వలేదని, తాను ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారని మండలిలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే ఎలా? అని ప్రశ్నించారు. కక్షగట్టి తనను పార్టీ నుంచి బహిష్కరించారని కవిత భావోద్వేగం చెందారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలు పెడితే అమరజ్యోతి వరకు ప్రతి దాంట్లో అవినీతి జరిగిందని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోడవం అవమానకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా పేరు మార్పును తాను అంగీకరించలేదని, తనతండ్రి చుట్టున్న వ్యక్తులు దురాగతాలు చేస్తుంటే పట్టించుకోవడం కూడా పొరపాటే నని కవిత పేర్కొన్నారు.