Reading Time: < 1 minute

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. శనివారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తుపాకీని పట్టుకొని, శత్రువుల వైపు గురిపెట్టి నిల్చున్న ఈ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్‌కి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో చూపిస్తున్నారు డైరెక్టర్ సాగర్ కె చంద్ర. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.