Reading Time: < 1 minute

రాకింగ్ స్టార్ యష్ ప్రతిష్టాత్మక మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ.. మిస్టీరియస్, గ్లామరస్ ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న హుమా ఖురేషి.. పవర్‌ఫుల్ గంగ పాత్రలో నటిస్తోన్న నయనతార పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలై ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా మేకర్స్ అందమైన, ఆకర్షణీయమైన, సున్నితమైన రెబెకా పాత్రలో నటిస్తోన్న తారా సుతారియా పాత్రను పరిచయం చేశారు. అందంగా, స్టైల్‌గా కనిపిస్తూనే రెబెకా పాత్రలోని తారా సుతారియా గన్‌ను ఉపయోగిస్తోన్న తీరు ఆకట్టుకుంటోంది.

యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్సర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.