
ప్రతి పక్షంలో ఉన్నప్పుడు సంప్రదాయాలు, విలువలు అంటూ నీతులు చెప్పిన కాం గ్రెస్ నాయకులు, అధికారంలోకి రాగా నే వాటిని తుంగలో తొక్కి తమకు నచ్చి నట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. టిపిసిసి అధ్యక్షుడిగా 2016 మార్చి 3న మీరు స్పీకర్‌కు రాసి సంతకం పెట్టిన ఉత్త రం గుర్తుందా..? అని మంత్రి ఉత్తమ్‌ను ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆడియో -విజువల్ ప్రెజం టేషన్ నిర్వహిస్తే అది భారతదేశ పార్లమెంట్ సంప్ర దాయాలకు విరుద్ధం, అందుకే తాము సభకు హాజరుకాబోమని అన్నా రని గుర్తు చేశారు, అదే ఉత్తమ్ ఇప్పుడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాలు లో ప్రజంటేషన్‌కు సిద్ధప డటం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని విమర్శించారు. ఆ ఉత్త రంపై ప్రస్తుత ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, ఎంఎల్‌ఎ పద్మా వతి కూడా సంత కాలు చేశారని అన్నారు. స్పీకర్‌ను బిఎసి సమావేశంలోనూ, ఉత్తరం ద్వారా కూడా అధి కార పక్షానికి ప్రె జంటేష న్‌కు అనుమతి ఇస్తే, బిఆర్‌ఎస్‌కూ అనుమతి ఇవ్వాలని కోరామని, అయి నప్పటికీ, తమ అభ్యర్థనను తిరస్కరించారని వాపో యారు.