Reading Time: 2 minutes

కొత్త ఏడాదిలో కొత్త రైడ్: జనవరిలో లాంచ్ కానున్న 4 పవర్‌ఫుల్ టాప్ బ్రాండెడ్ బైక్స్ ఇవే..

Caption of Image.

కొత్త ఏడాది 2026 బైక్ లవర్స్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. జనవరి నెలలోనే దేశీయ మార్కెట్లోకి ప్రముఖ బ్రాండ్ల నుంచి నాలుగు శక్తివంతమైన బైక్‌లు సందడి చేయనున్నాయి. అడ్వెంచర్ రైడింగ్ నుంచి క్లాసిక్ క్రూజింగ్ వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ మోడల్స్ ఉండనున్నాయి. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. BMW F 450 GS: 
అడ్వెంచర్ బైక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్ ఇది. తమిళనాడులోని టీవీఎస్ ప్లాంట్‌లో తయారవుతున్న ఈ బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 420cc ట్విన్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 47 bhp పవర్‌ను విడుదల చేస్తుంది. 6.5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, ఈజీ రైడ్ క్లచ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2. Royal Enfield Bullet 650: 
యువతలో బుల్లెట్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే ఐకానిక్ డిజైన్‌తో 650cc పవర్ ఫుల్ ఇంజన్‌తో ‘బుల్లెట్ 650’ రాబోతోంది. ఇది 46.4 bhp శక్తిని ఇచ్చే ప్యారలల్-ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. క్లాసిక్ లుక్‌తో పాటు ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఆధునిక హంగులతో ఈ బైక్ రాబోతోంది.

3. KTM 390 Adventure R: 
ఆఫ్-రోడింగ్ చేయడమంటే ఇష్టపడే వారి కోసం కేటీఎం ఈ ‘R’ వర్షన్‌ను లాంచ్ చేస్తోంది. సాధారణ 390 అడ్వెంచర్ కంటే ఇది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, భారీ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. 398cc ఇంజన్‌తో 44 bhp పవర్‌ను ఇచ్చే ఈ బైక్ కఠినమైన దారుల్లో ప్రయాణించడానికి అనువుగా డిజైన్ చేయబడింది. ప్రస్తుతానికి దీని ఎక్స్ షోరూం ధర రూ.3లక్షల 95వేలుగా నిర్ణయించబడింది.

ALSO READ : DGCAకి నివేదిక ఇచ్చిన దర్యాప్తు కమిటీ..అందులో ఏముందంటే.?

4. Brixton Crossfire 500 Storr: 
ఇక చివరిగా ఆస్ట్రియాకు చెందిన బ్రిక్స్టన్ బ్రాండ్ నుంచి వస్తున్న తొలి అడ్వెంచర్ బైక్ కొత్త ఏడాది అడుగుపెడుతోంది భారత మార్కెట్లోకి. దీని లుక్ చాలా వెరైటీగా, ‘నియో-రెట్రో’ స్టైల్‌లో ఉంటుంది. 486cc ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్.. 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 7-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. కొత్త రకం డిజైన్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీని ధర రూ.4లక్షల వరకు ఉండొచ్చని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.