Reading Time: 2 minutes

Arshdeep Singh: స్నాప్‌చాట్ పోస్ట్.. అమ్మాయితో అడ్డంగా దొరికేసిన అర్ష్‌దీప్ సింగ్

Caption of Image.

Arshdeep Singh: పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అతడి స్నాప్‌చాట్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు డేటింగ్ రూమర్లకు దారి తీశాయ. ఒక మిస్టరీ గర్ల్ చేయి పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేయడంతో, ఆ అమ్మాయి ఎవరనే దానిపై అభిమానుల్లో ఇంట్రెస్ట్ మొదలైంది. ఇక ఆ అమ్మాయి పంజాబీ నటి సమ్రీన్ కౌర్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చేతిపై ఉన్న టాటూ, సమ్రీన్ కౌర్ టాటూతో సరిపోలడమే ఇందుకు ప్రధాన కారణం.. అంతేకాదు, ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో, న్యూ చండీగఢ్‌లో జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు ఆమె హాజరుకావడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది.

సమ్రీన్ కౌర్ ఎవరు?: 
సమ్రీన్ కౌర్ పంజాబీ చిత్ర పరిశ్రమలో పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలు, సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా, కపిల్ దేవ్ నాయకత్వంలోని 1983 వరల్డ్ కప్ విజయం ఆధారంగా తెరకెక్కిన ’83’ సినిమాలో కూడా ఆమె ఒక పాత్రలో నటించారు. 

మైదానంలో అర్ష్‌దీప్: 
ఈసారి జరుగుతున్న ఐపీఎల్ లో అర్ష్‌దీప్ సింగ్‌కు అంతగా కలిసిరాలేదు. ఈ సీజన్‌లో అతడు ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. లైన్ అండ్ లెంగ్త్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ త్వరలోనే ఫామ్‌లోకి వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టుకి తొలి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్, అభిమానులు ఆశిస్తున్నారు. అటు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం, ఇటు మైదానంలో సవాళ్లతో అర్ష్‌దీప్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samreen (@samreenkaur__)

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samreen (@samreenkaur__)

 

 

©️ VIL Media Pvt Ltd.