
Arshdeep Singh: మైదానంలో తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను వణికించే టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. అర్ష్‌దీప్ తన స్నాప్‌చాట్ అకౌంట్‌లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేయడంతో, నెటిజన్లు ఆ అమ్మాయి ఎవరనే దానిపై ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అర్ష్‌దీప్ షేర్ చేసిన ఫోటోలో ఆ అమ్మాయి ముఖం కనిపించకపోయినప్పటికీ, నెట్టిజన్లు ఒక చిన్న క్లూ ద్వారా ఆమె ఎవరో కనిపెట్టేశారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..
READ ALSO: New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అర్ష్‌దీప్ పట్టుకున్న ఆ అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ ఉంది. మోడల్, నటి అయిన సమ్రీన్ కౌర్ చేతిపై కూడా సరిగ్గా అదే టాటూ ఉండటంతో, ఆమె అర్ష్‌దీప్ లవర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా సమ్రీన్ పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇంతకీ అర్ష్‌దీప్ లవర్‌గా ప్రచారం జరుగుతున్న ఈ సమ్రీన్ కౌర్ నేపథ్యం ఏంటో తెలుసా.. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సమ్రీన్ (26), పూణేలోని సింబయాసిస్ కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మోడల్, నటిగా రాణిస్తున్న ఆమె 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ చిత్రాలలో నటించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఇటు అర్ష్‌దీప్ కానీ, అటు సమ్రీన్ కానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ ఈ స్నాప్‌చాట్ స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
READ ALSO: Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!