Reading Time: 2 minutes
Kkr Vs Pbks Toss Update Ajinkya Rahane Opts To Bat Two Changes In Kkr Playing Xi

KKR vs PBKS: ఐపీఎల్ 2026 సీజన్ 12వ మ్యాచ్‌ లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. పిచ్ పొడిగా ఉండటంతో మొదట భారీ స్కోరుకు సాధించగలమని రహానే అన్నాడు. ఈ సీజన్‌లో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన కోల్‌కతా, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది.

ఈ కీలక మ్యాచ్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తుది జట్టులో రెండు ముఖ్యమైన మార్పులు చేసింది. స్టార్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా, సునీల్ నరైన్ అనారోగ్యం వల్ల ఈ మ్యాచ్‌ కు దూరం కావాల్సి వచ్చింది. వారి స్థానాల్లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్, పేసర్ నవదీప్ సైనీ జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ ల్లోనూ విజయం సాధించి అజేయంగా ఉన్న పంజాబ్ కింగ్స్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా అదే పాత జట్టుతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని, రహానే నిర్ణయం తమకు అనుకూలించిందని తెలిపారు.

Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో వీరిద్దరూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది. పాంటింగ్ తనకు ఒక స్ఫూర్తి అని, ఆయన పక్కన పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని శ్రేయస్ టాస్ సమయంలో అన్నాడు. పంజాబ్ తరపున శ్రేయస్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య దూకుడుగా ఆడుతుండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. అయితే మధ్య ఓవర్లలో చాహల్, వైశాఖ్ బౌలింగ్‌పై పంజాబ్ ఆశలు పెట్టుకుంది.

రికార్డులను పరిశీలిస్తే కోల్‌కతా నైట్ రైడర్స్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడగా.. ఇందులో కేకేఆర్ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ 13 సార్లు మాత్రమే గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 9 గెలిచి తన హోమ్ గ్రౌండ్‌పై పట్టు నిరూపించుకుంది. అయితే 2023 నుండి పంజాబ్ కింగ్స్ పుంజుకుంది. చివరగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ నాలుగింటిలో గెలిచింది. ఈ అంశం కేకేఆర్ ను కలవరపెడుతోంది.

JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

ప్లేయింగ్ XI:
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే (కెెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెెప్టెన్), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ విశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.