Reading Time: < 1 minute

ఐపీల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో కోల్ కతా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో క్యాచ్ పడుతూ గాయపడిన వరుణ్ చక్రవర్తి, నరైన్ స్థానాల్లో పావెల్, సైనీ జట్టులోకి తీసుకున్నట్లు రహానె తెలిపాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన కోల్ కతా ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉంది.

జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ (c), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, అజింక్యా రహానే(సి), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(w), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి