Reading Time: 2 minutes
Nasas Artemis Ii Mission The Return To Moons Far Side And Free Return Trajectory Explained

Artemis 2: అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర నమోదైంది. మానవసహిత అంతరిక్ష యాత్రలలో అద్భుతం జరిగింది. ఆర్టిమిస్ -2 మిసన్ చంద్రుని గ్రావిటేషనల్ పరిధిలోకి చేరింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డు కన్నా ఇది సుమారుగా 2500 కి.మీ ఎక్కువ.

రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్టిమిస్-2:

ఆర్టిమిస్ -2 ఏప్రిల్ 7, 2026న భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 12.15 గంటలకు చంద్రుడి సమీప యాత్రను ప్రారంభించనుంది. వ్యోమగాలులు చంద్రుడి అవతలి వైపు వెళ్లనున్నారు. భూమికి చంద్రుడికి మధ్య దూరం సుమారుగా 3,84,633 కిలోమీటర్లు. 1972లో అపోలో శకం ముగిసిన తర్వాత మొదటిసారిగా చంద్రుడి అవతలి పక్క భాగాన్ని దాటిన రికార్డ్ ఆర్టిమిస్ -2 పేరిట ఉండబోతోంది.

ఇంజన్ ఫెయిల్ అయినా భూమిని చేరుతుంది:

ఆర్టిమిస్-2 ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అనే పిలవబడే మార్గంలో ప్రయాణిస్తోంది. అంటే, ఈ అంతరిక్ష నౌక తిరిగి భూమిపైకి రావడానికి ప్రత్యేకంగా ఇంజన్లను మండించాల్సిన అవసరం లేదు. చంద్రుడిని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి సహజంగా భూమి వైపు వస్తుంది. ఒక వేళ ఇంజన్ ఫెయిల్ అయినప్పటికీ, చంద్రుడి గ్రావిటీని ఉపయోగించి సురక్షితగంగా తిరిగి రావచ్చు.

సుదూర విశ్వం ఎందుకంత భిన్నం:

భూమికి 2000 కి.మీ ఎత్తు వరకు ఉన్న ప్రాంతంలో ఉపగ్రహలకు, అంతరిక్ష నౌకలు, అందులో ఉన్న వ్యోమగాములకు భూమి అయస్కాంత క్షేత్రం(ఎర్త్ మాగ్నిటిక్ ఫీల్డ్) రక్షణ కల్పిస్తుంది. సూర్యుడు, సుదూర విశ్వం నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్‌ను భూమి మాగ్నిటిక్ ఫీల్డ్ పక్కకు తప్పిస్తుంది.

వ్యోమనౌక భూమి వాతావరణంలోకి వచ్చేటప్పుడు దాదాపుగా 2760 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. వ్యోమనౌకకు ఉండే హీట్ షీల్డ్ ఈ వేడి నుంచి రక్షిస్తుంది. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల ఇంత వేడి జనరేట్ అవుతుంది. రీఎంట్రీ సమయంలో దాని వేగం గంటకు 40,200 కి.మీ ఉంటుంది.

ఈ మిషన్ చంద్రుడి కోసం కాదు. భవిష్యత్తులో మార్స్ మిషన్ కోసం ట్రయల్ రన్‌గా భావిస్తున్నారు. మానవశరీరంపై సుదూర విశ్వం ఎలా పనిచేస్తుందని అంచనా వేస్తారు. కొత్త టెక్నాలజీలను పరీక్షిస్తారు. రేడియేషన్ ప్రభావం, అంతరిక్ష నౌక పనితీరును అంచనా వేస్తారు.