
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 6న) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగబోతుంది. వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా.. ముఖ్యంగా కేకేఆర్ బౌలింగ్ విభాగం గత రెండు మ్యాచ్‌ల్లోనూ 220కి పైగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో చెన్నైపై 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి తమ బ్యాటింగ్ సత్తాను చాటింది.
పిచ్ రిపోర్ట్:
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి అమల్లోకి వస్తే ఛేజింగ్ చేసే జట్టుకు ప్రయోజనం ఉంటుంది.
ఏ జట్టు గెలుస్తుందంటే?:
ప్రస్తుత ఫామ్ ప్రకారం పంజాబ్ కింగ్స్ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వరుస విజయాలతో ఉన్న పంజాబ్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. అయితే, వర్షం పడి మ్యాచ్ ఓవర్లు తగ్గితే, టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఓవరాల్‌గా ఈ పోరులో పంజాబ్ కింగ్స్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తుది జట్ల అంచనా:
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ (కీపర్), కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, రమణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
(ఇంపాక్ట్ ప్లేయర్: బ్లెస్సింగ్ ముజరబానీ)
పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్.
(ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్)