Reading Time: < 1 minute

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చార్టర్ విమానం సాంకేతిక లోపానికి గురైంది. ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్ నుండి రాయ్‌పూర్‌కు వెళ్తున్న VT-REM చార్టర్ విమానం.. ఎయిర్ పోర్టు ప్రధాన రన్‌వే నుండి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేపై నిలిచిపోవడంతో, ఆర్జీఐ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొన్ని నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందించారు.

“నిన్న రాయపూర్‌కు బయలుదేరాల్సిన VT-REM చార్టర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది కొద్దిసేపు టాక్సీవేపై నిలిచింది. పరిస్థితిని గుర్తించిన మా ఎయిర్‌సైడ్ బృందం వెంటనే స్పందించి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని తక్షణమే సురక్షితంగా తరలించింది. ఈ కారణంగా ఒక విమానం గో-అరౌండ్ చేయాల్సి వచ్చినప్పటికీ, ఎటువంటి అంతరాయం లేకుండా విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగాయి” అని ఆర్జీఐ విమానాశ్రయ అధికారులు తెలిపారు.