Reading Time: < 1 minute
Tn 2026 Movie Row Vijay Fans Allege Political Attack Ahead Of Tamil Nadu Elections

ఎన్నికల వేళ టీవీకే అధినేత, హీరో విజయ్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీసారంటూ దళపతి అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమా ట్రైలర్‌లో కనిపిస్తున్న సన్నివేశాలు రాజకీయ పార్టీ స్థాపన నుంచి వ్యక్తిగత జీవితంపై సూచనలు వరకూ ఉండటంతో.. ఇది కేవలం సినిమా కాదు, పొలిటికల్ అటాక్ అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్ర నిర్మాతలు అధికార పార్టీ డీఎంకేకు దగ్గర వాళ్లేనన్న ప్రచారం వివాదాన్ని మరింత రాజేసింది.

తమిళనాడులో ‘TN 2026’ సినిమా తీవ్ర వివాదస్పదంగా మారింది. పోలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్‌లో విజయ్ సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను పోలి ఉండే సన్నివేశాలు ఉన్నాయంటూ టీవీకే వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక చిత్ర నిర్మాతలు అధికార పార్టీ డీఎంకేకు సన్నిహితులేనన్న ప్రచారం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అయితే విజయ్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, ప్రస్తుత రాజకీయాలపై వినోదాత్మకంగా వ్యాఖ్యానించడమే లక్ష్యమని చిత్రబృందం వివరణ ఇస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన కొన్ని సన్నివేశాలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. విజయ్ తరహా వేషధారణ, అగ్రహీరో రాజకీయ పార్టీ స్థాపన, సినీ నటుల రాజకీయాలపై సంభాషణలు, ప్రముఖ నటితో సన్నిహితంగా చూపించిన దృశ్యాలు వివాదానికి దారితీశాయి.

Also Read: Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

ట్రైలర్‌పై టీవీకే నాయకులు తీవ్రంగా స్పందించారు. ‘మా నాయకుడిని విమర్శించే సినిమాను అడ్డుకుంటాం’ అంటూ హెచ్చరించారు. డీఎంకే పార్టీ కోలీవుడ్‌పై ప్రభావం చూపుతోందని ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ వివాదం ఎన్నికల దిశగా మళ్లింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని దేశీయ మక్కల్ శక్తి కచ్చి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈసీకి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. సినిమా విడుదల ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంటూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విడుదలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.