Reading Time: 2 minutes
Gold Price Today: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ నిర్ణయిస్తుంది. అక్కడ జరిగే ట్రేడింగ్ ఆధారంగా ప్రపంచ దేశాల్లో ధరలు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వ్యాపారం అమెరికన్ డాలర్లలో జరుగుతుంది. డాలర్ విలువ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి, డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. గత కొన్ని రోజులు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మూడ్రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

మే 24 ఆదివారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,59,060గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,45,800 వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,290 వద్ద ట్రేడవుతుంది. ఇక దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,85,000 వద్ద కొనసాగుతుంది. దాదాపు శనివారం కూడా ఇవే రేట్లు ఉన్నాయి. అంటే నిన్నతో పోల్చుకుంటే ఇవాళ రేట్లలో ఎలాంటి పెరుగుదల లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా

  • హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,800 వద్ద ట్రేడవుతోంది.
  • ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,210 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,950 వద్ద ట్రేడవుతోంది.
  • ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.1,59,060 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,800వద్ద ట్రేడవుతోంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,800 వద్ద ట్రేడవుతోంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,690 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,300 వద్ద ట్రేడవుతోంది.
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,800 వద్ద ట్రేడవుతోంది.
  • కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,800 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి