Reading Time: < 1 minute

అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. మెజార్టీలో 100 మార్క్ క్రాస్

Caption of Image.

దిస్‎పూర్: అస్సాంలో అధికార బీజేపీ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‎లో మెజార్టీ సెంచరీ మార్క్ ధాటిన కమలం పార్టీ హ్యాట్రిక్ విజయం దిశగా పయనిస్తోంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 64 సీట్లు అవసరం. బీజేపీ ఈ మ్యాజిక్ ఫిగర్‎ను ధాటి 100కు పైగా సీట్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి నిరాశపూరిత ట్రెండ్స్ వెలువడుతున్నాయి.

ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాల్లో మాత్రమే లీడింగ్‎లో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‎కు కాంగ్రెస్ చాలా వెనుకంజలో ఉండటంతో హస్తం పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కానుంది. జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సీఎం హిమంత బిస్వా శర్మ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

అస్సాం కాంగ్రెస్ చీఫ్, ఎంపీ గౌరవ్ గొగొయ్ జోర్హాట్‎లో లీడ్‎లో ఉన్నారు. బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించనుండటంతో ఆ పార్టీ శ్రేణులు అప్పుడే సంబరాలు షూరు చేశారు. అస్సాం బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర పండగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి తరలివస్తున్నారు. కాగా, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.