Reading Time: 2 minutes

IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు.. నయా రికార్డ్ క్రియేట్ చేసిన సునీల్ నరైన్ 

Caption of Image.

కోల్‎కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కేకేఆర్ స్టార్ స్పి్న్నర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీ (కేకేఆర్) తరుఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‎గా నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆదివారం (మే 3) సన్ రైజర్స్ హైదరాబాద్‎తో జరిగిన మ్యాచులో 2 వికెట్లు తీయడం ద్వారా ఈ రేర్ ఫీట్ నెలకొల్పాడు.

అలాగే, ఐపీఎల్‎లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్‎గా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు ఈ మిస్టరీ స్పిన్నర్. దీంతో పాటు ఓవరాల్‎గా ఐపీఎల్‎లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. నరైన్ కంటే ముందు చాహల్ (228), భువనేశ్వర్ కుమార్ (215) ఉన్నారు. 

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 19లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు కేకేఆర్ బ్రేక్ వేసింది. ఆదివారం (మే 3) ఉప్పల్ స్డేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఎస్ఆర్‎హెచ్‎ను చిత్తు చేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రహానే సేన 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‎పై ఘన విజయం సాధించింది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో విజయం సాధించి ఫ్లే ఆఫ్స్ ఆశలను కేకేఆర్ సజీవంగా ఉంచుకుంది. 

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అరోరా, అంకుల్ రాయ్, గ్రీన్ తలో వికెట్ సాధించారు. సన్ రైజర్స్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో కేకేఆర్ ఛేధించింది. అంగ్‎క్రిష్ రఘువంశీ (59) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రహానే (43) ఆకట్టుకున్నాడు. కమిన్స్, సాకీబ్ హోస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీశారు.  

ఐపీఎల్‌లో ఒకే జట్టు తీసిన అత్యధిక వికెట్లు:

  • 200: KKR తరఫున నరైన్
  • 186: ఎంఐ తరఫున బుమ్రా
  • 170: ఎంఐ తరఫున మలింగ
  • 157: SRH తరుఫున భువనేశ్వర్
  • 143: సీఎస్కే తరఫున జడేజా
  • 139: ఆర్‌సీబీ తరఫున చాహల్
  • 139: CSK తరుఫున బ్రావో
©️ VIL Media Pvt Ltd.