Reading Time: < 1 minute

వాటర్‌‌‌‌ ట్యాప్‌‌లకు ఉండే గ్రిల్‌‌లో దుమ్ము ఇరుక్కుపోతే ఫ్లో తగ్గిపోతుంది.. అందుకే ఈ క్లీనింగ్ బ్రష్..!

Caption of Image.

వాటర్‌‌‌‌ ట్యాప్‌‌లకు ఉండే గ్రిల్‌‌లో దుమ్ము ఇరుక్కుపోతే ఫ్లో తగ్గిపోతుంది. అలాంటివాటిని ఈ బ్రష్‌‌తో ఈజీగా క్లీన్‌‌ చేయొచ్చు. దీన్ని వోర్వెన్‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇవి బాత్‌‌ షవర్లు, మొబైల్ స్పీకర్ గ్రిల్స్‌‌ లాంటి వాటికి ఉండే చిన్న రంధ్రాలను శుభ్రం చేయడానికి తయారుచేసిన మల్టీఫంక్షనల్ టూల్స్​. వీటితో షవర్ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని లేదా నీటి వల్ల ఏర్పడే పొరను తొలగించవచ్చు. 

ఈ బ్రష్‌‌లు సందులు, చిన్న రంధ్రాలలోకి 1 సెం.మీ. లోతు వరకు చొచ్చుకుపోతాయి. హై క్వాలిటీ నైలాన్ బ్రిసిల్స్‌‌తో తయారైన ఈ బ్రష్‌‌లు క్లీనింగ్ చేసేటప్పుడు వస్తువులపై చిన్న గీత కూడా పడదు. వీటిని కీబోర్డ్ సందులు, మొబైల్ చార్జింగ్ పోర్ట్‌‌లను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. సెట్‌‌లో 10 చిన్న బ్రష్‌‌లు ఉంటాయి.

ఈ క్లీనింగ్ బ్రష్ ధర 152 రూపాయలే.

©️ VIL Media Pvt Ltd.