Reading Time: < 1 minute

బోరబండలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్… ముగ్గురికి గాయాలు

Caption of Image.

జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండలో ఆదివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దమ్మగుడి నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ భవనం రెండో అంతస్తులో నాగరాజు, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు బిల్డింగ్​మీద నిద్రపోయారు. 

శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో నాగరాజు నీళ్లు తాగేందుకు లేచాడు. ఇంట్లోకి వచ్చి లైట్ ఆన్ చేయగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్​ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి గోడ పూర్తిగా కూలిపోవడంతో పక్క పోర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిద్రిస్తున్న శివకృష్ణ, వీరేశమ్మ(28), మౌనిక(11) గాయపడ్డారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. నాగరాజుకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

©️ VIL Media Pvt Ltd.