Reading Time: 2 minutes

టెన్త్ విద్యార్థులకు అలర్ట్: జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

Caption of Image.

హైదరాబాద్: టెన్త్ విద్యార్థులకు విద్యా శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన వారికి, తక్కువ మార్కులు వచ్చి ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకునే విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్‏ను విద్యా శాఖ ప్రకటించింది. 2026, జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపింది. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 

2026, ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా లేదా తెలంగాణ బోర్డు అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లించాలి. అలాగే, మార్కుల రీ కౌంటింగ్, పేపర్ రీ వెరిఫికేషన్‎ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 2026, ఏప్రిల్ 30 నుంచి మే 15 వరకు గడువు ఇచ్చారు. 

టెన్త్ రిజల్ట్స్ విడుదల

తెలంగాణలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను రిలీజ్ చేశారు. మొత్తం 95.51 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం గమనార్హం. టెన్త్ క్లాస్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. అమ్మాయిలు 96.26 శాతం ఉత్తీర్ణులు కావడం గమనార్హం. 

ALSO READ :  తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఫలితాలు సింపుల్గా ఇలా చూసుకోండి !

అబ్బాయిలు కూడా అమ్మాయిలకు ధీటుగా 94.07 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సారి వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. పదో తరగతి ఫలితాలను వాట్సప్ లోనూ పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఎస్ఎస్సీ పరీక్షలకు అటెండ్ అయిన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీసేవా వాట్సప్ నంబర్ 80969 58096 ద్వారా పొందవచ్చని చెప్పారు. ఆ నంబర్‎కు Hi అని మెసేజ్ చేసి, ఎస్ఎస్సీ రిజల్ట్ అని టైప్ చేయాలి. మెనూలో ఓపెన్ సర్వీసెస్ ఎంపిక చేసుకొని, హాల్ టికెట్ నంబర్ ఇస్తే.. మార్కుల మెమో వస్తుంది.

మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగ్గా.. మొత్తం 5 లక్షల 28 వేల మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. విద్యార్థులు తమ రిజల్ట్ను https://results.bsetelangana.org, https://bse.telangana.gov.in, https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

 

©️ VIL Media Pvt Ltd.