Reading Time: < 1 minute

PGIMERలో 134 మెడికల్ ఆఫీసర్ పోస్టులు: మే 11 వరకు ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), చండీగఢ్  మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్/ జూనియర్ డెమానిస్ట్రేటర్. 

మొత్తం ఖాళీలు: 134. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి. కేంద్ర/ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంసీఐ -గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 45ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 25.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.800. పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: మే 11. 

కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ తేదీ: మే 22. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ pgimer.edu.in ను సందర్శించండి.
 

©️ VIL Media Pvt Ltd.