Reading Time: < 1 minute

బెట్టింగ్ వద్దు సోదరా.. బంగారు భవిష్యత్ ఉందిరా : ఆసిఫాబాద్‌‌ జిల్లా కౌటాల ఎస్సై

Caption of Image.

కాగజ్ నగర్, వెలుగు: ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడుతుండగా అడ్డుకునేలా ఆసిఫాబాద్‌‌ జిల్లా కౌటాల ఎస్సై చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల రోజులుగా నడుస్తున్న ఐపీఎల్ జరుగుతుండగా క్రికెట్ మోజులో పల్లె యువత బెట్టింగ్​లకు బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పులు పాలై ప్రాణాలు తీసుకుంటున్నారు. 

ఈనేపథ్యంలోనే ఎస్సై చంద్రశేఖర్​చొరవ తీసుకుని స్థానిక యువకులతో రీల్స్ చేసి మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ యువకుడు ఐపీఎల్ లో బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగుట్టుకొని బలవన్మరణానికి ప్రయత్నిస్తుండగా ఎస్సై అడ్డుకున్నారు. క్రికెట్ మీద అభిమానం ఉండాలి కానీ, బెట్టింగ్ లకు బానిసలై జీవితాలను పాడుచేసుకోవద్దని వీడియో ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

©️ VIL Media Pvt Ltd.