Reading Time: < 1 minute

Dulquer Salmaan: లక్కీ భాస్కర్ ఫ్యాన్స్‌కు షాక్.. వాయిదాపడిన దుల్కర్‌‌‌‌‌‌‌‌ గేమ్.. కారణమిదే!

Caption of Image.

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్  హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి  ‘ఐయామ్ గేమ్’.  జోమ్ వర్గీస్‌‌‌‌తో కలిసి దుల్కర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.  నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా, షాబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథను రాశారు.

తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.  తొలుత ఆగస్టు 20న  ఓనం కానుకగా విడుదల చేయాలని ప్రకటించినా.. కొన్ని అనివార్య కారణాలతో రెండు వారాలు వాయిదా వేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 3న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌‌‌‌లో ఇది 40వ సినిమా కాగా,  ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు, దర్శకుడు మిస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

ALSO READ : ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

©️ VIL Media Pvt Ltd.