Reading Time: 2 minutes
Bank Account: మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు ఎలా తీసుకోవాలి..? కుటుంబసభ్యులు ఈ చిన్న పని చేస్తే డబ్బు మీకే..

దేశంలో ప్రస్తుతం ప్రతీఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, నగదు లావాదేవీలు చేయాలన్నా బ్యాంక్ ఖాతా అవసరం. ఇప్పట్లో బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్ ద్వారా సులువుగా వీడియో కేవైసీ పూర్తి చేసి అకౌంట్ సులభంగా పొందవచ్చు. నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతా పొందవచ్చు. అయితే ఓ వ్యక్తి మరణిస్తే అతడి బ్యాంక్ అకౌంట్లోని డబ్బు ఏమవుతుంది? ఆ సొమ్మును కుటుంబసభ్యులు తీసుకోవచ్చా? నామినీ క్లెయిమ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎవరూ క్లెయిమ్ చేసుకోవడం లేదు

దేశంలోని బ్యాంకుల్లో ఆన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు దాదాపు రూ.98,070 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ చెబుతోంది. ఇందులో మరణించిన ఖాతాదారుల సొమ్ముతో పాటు ఇనాక్టివ్ అయిన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన నగదు ఉంది. చాలామంది రెండు, మూడు అకౌంట్లను వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒక అకౌంట్‌ను ఉపయోగించకుండా సంవత్సరాలపాటు అలాగే ఉంచుతారు. కొన్నేళ్ల తర్వాత అకౌంట్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. ఇనాక్టివ్ అకౌంట్లోని సొమ్మును 10 ఏళ్ల పాటు ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవర్‌నెస్ ఫండ్‌కు బ్యాంకులు పంపుతాయి. ఈ ఏడాది జనవరి 31 నాటికి ఇలాంటి సొమ్ము రూ.98,703 కోట్లగా ఉంది. ఎస్బీఐలో అత్యధికంగా రూ.20,400 కోట్ల అన్‌క్లెయిమ్డ్ నగదు ఉంది. ఇక కెనరా బ్యాంకులో రూ. 6,830 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 5,848 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 5,549 కోట్ల సొమ్ము ఉంది.

ఖాతాదారుడి బ్యాంక్ వివరాలు ఎలా తెలుసుకోవాలి..?

ఖాతాదారులు మరణించిన తర్వాత వారి అకౌంట్లోని సొమ్మును చట్టద్దమైన వారసులు, కుటుంబసభ్యులు లేదా నామినీలు క్లెయిమ్ చేసుకోవడం లేదు. కుటుంబసభ్యులు, నామినీలకు ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్ల గురించి తెలియకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇలాంటి సందర్బంలో ఆర్బీఐ UDGAM పోర్టల్ ద్వారా మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ వివరాలతో అతడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయా.. లేదా అనే వివరాలను తెలుసుకోవచ్చు. పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి నమోదు చేస్తే అతడి బ్యాంక్ వివరాలు తెలుస్తాయి. దీంతో సదరు బ్యాంక్‌కు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పిస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు, మీకు అతడితో ఉన్న సంబంధానికి సంబంధించిన రుజువులు సమర్పిస్తే సరిపోతుంది. బ్యాంక్ సిబ్బంది పరిశీలించి వెంటనే మీకు అతడి అకౌంట్లో ఉన్న నగదు విత్ డ్రా చేసి అందిస్తారు. ఓ వ్యక్తి మరణించినప్పుడు అతడి అకౌంట్లోని డబ్బులను ఈ విధానంలో తీసుకోవచ్చు.