
బూర్గంపహాడ్, వెలుగు: వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో ఉన్న చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీరియస్‌గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. గురువారం చెరువుసింగారం బీట్ పరిధిలోని నకిరిపేట అటవీప్రాంతాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
అటవీ సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి చర్యలను ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. నేరానికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. బీట్ ఆఫీసర్ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన వెంట ఎఫ్ఎవో కృష్ణప్రసాద్, డీఆర్వోలు అనార్కలీ, క్రాంతి, ఎస్ఆర్వో సురేశ్, ఎస్ఐ రామ్మూర్తి, విద్యుత్ శాఖ అధికారులు, బీట్ ఆఫీసర్లు ఉన్నారు.