
- ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీటి హక్కులను బలి చేసింది కేసీఆరేనని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసం పక్క రాష్ట్రానికి మేలు చేశారని ఆరోపించారు. గురువారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటా చాలని కేసీఆర్ సంతకం చేశారని, దీంతో రాష్ట్ర రైతులకు అన్యాయం జరిగిందని ఫైర్అయ్యారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 500 టీఎంసీల నీటి వాటా కోసం పోరాడుతున్నారని చెప్పారు. నీటి వాటాలపై బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాదని, దీనిపై చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ అంశంపై చర్చించాలని యెన్నం సవాల్ చేశారు.