
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో అడ్మిట్ చేశారు. వైద్యులు ఆయనకు కరోనరీ యాంజియోగ్రఫీతో సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు నడ్డా ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం (ఆగస్ట్ 14) ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
‘‘కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురివకావడంతో 2026, ఆగస్టు 13వ తేదీ సాయంత్రం ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఆయనకు కరోనరీ యాంజియోగ్రఫీతో సహా పలు పరీక్షలు నిర్వహించారు. నడ్డా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన కార్డియాలజీ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు’’ అని తెలిపింది.
►ALSO READ | మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి: భర్తల హత్యల్లో UP 1st ర్యాంక్.. 2వ స్థానంలో మధ్యప్రదేశ్
నడ్డా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారని తెలియడంతో బీజేపీ శ్రేణులతో పాటు ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు.. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నడ్డా హెల్త్ కండీషన్ పై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా క్రాకోచ్ జనతా పార్టీ ఆందోళనల సమయంలో నడ్డా కీలకంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపి యువత ఆందోళన విరమించడంలో కీలక పాత్ర పోషించారు.