Reading Time: 2 minutes

Vishwanadh and Sons Review.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

Caption of Image.

తమిళ స్టార్ హీరో సూర్య, ప్రసెంట్ సెన్సేషనల్ బ్యూటీ మమిత బైజు జంటగా నటించిన మూవీ ‘విశ్వనాథ్​ అండ్ సన్స్’ (Vishwanath and Sons). లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇవాళ (ఆగస్టు 14, 2026న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమా థియేటర్లలోకి రాకముందే ట్రేడ్‌లో భారీ సంచలనం సృష్టించింది. సుమారు రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వివిధ రైట్స్ రూపంలో రూ.215 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుని సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

ఇంతకీ ‘విశ్వనాథ్​ అండ్ సన్స్’ ఎలా ఉంది? డైరెక్టర్ వెంకీ అట్లూరి మరోసారి తన కంటెంట్తో మెప్పించాడా? ప్రీమియర్స్ చూసిన సూర్య అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? అనేది తెలుసుకుందాం…  

కథేంటంటే:

సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒకప్పుడు భారతదేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన అంతర్జాతీయ పిస్టల్ షూటర్. 45 ఏళ్ల వయసులో కెరీర్ చివరి దశలో ఉండగా, భార్య మరణంతో తన కుమారుడు విహాన్‌ను ఒంటరిగా పెంచుతూ జీవితం గడుపుతుంటాడు. అతని తల్లి (రాధిక శరత్‌కుమార్) కుటుంబానికి అండగా ఉంటుంది. 

ఇదే సమయంలో అనన్య (మమితా బైజు) అనే 24 ఏళ్ల యువతి లండన్‌లో నర్సింగ్ చదువుతూ పార్ట్‌టైమ్ కేర్‌టేకర్‌గా పని చేస్తుంది. ఒక ప్రమాదం తర్వాత విహాన్‌కు సంరక్షకురాలిగా ఆమె సంజయ్ ఇంటికి వస్తుంది. మొదట ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయి. కానీ విహాన్ ద్వారా వారిద్దరి మధ్య నమ్మకం, ఆప్యాయత పెరుగుతుంది.

ఈ క్రమంలోనే కథలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అనన్య సాధారణ కేర్‌టేకర్ కాదని సంజయ్ కు తెలుస్తుంది. ఇంతకీ అనన్య ఎవరు? సంజయ్ భార్య ఎవరు? వయసులో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ (Age-gap), సంజయ్-అనన్య మధ్య ఏర్పడే మానసిక బంధం ఎంతవరకు వెళ్ళింది? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సంజయ్ ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చింది? చివరకు సూర్య- అనన్య ఒక్కటయ్యారా? లేదా అనేది మిగతా కథ.

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ప్రీమియర్/ఎర్లీ ఆడియన్స్ రియాక్షన్స్‌ చూస్తే విశ్వనాథ్ & సన్స్ మూవీకి టాక్ పాజిటివ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా సూర్య నటన, మమితా బైజు ఫ్రెష్ పెయిరింగ్, వెంకీ అట్లూరి రైటింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు సినిమాను “బ్రీజీ అండ్ ఎంజాయబుల్” అని రివ్యూలు ఇస్తున్నారు. 

మధ్య వయస్కుడైన వ్యక్తి పాత్రలో సూర్య చూపించిన ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మమితా బైజు కూడా తన పాత్రలో ఫ్రెష్‌గా కనిపించిందని, సూర్యతో ఆమె కెమిస్ట్రీ బాగుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్‌షిప్ డ్రామా ప్రేక్షకులను కనెక్ట్ చేసేలా ఉన్నాయని ప్రారంభ స్పందనలు చెబుతున్నాయి.

వెంకీ అట్లూరి రైటింగ్, కథను ఎమోషనల్‌గా నడిపించిన విధానానికి కూడా ప్రశంసలు వస్తున్నాయి. సినిమా మొత్తాన్ని యాక్షన్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్‌పై కాకుండా కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాల చుట్టూ నడిపించడమే ఈ చిత్రానికి ప్రత్యేకతగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

మరోవైపు, ఫస్టాఫ్ లో ఉన్న ఫ్లో.. సెకండాఫ్‌లో కొంచెం మిస్ అయిందని ఆడియన్స్ అంటున్నారు. పెద్దగా వర్కౌట్ కాని సబ్‌ప్లాట్స్ ఉండటంతో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందని టాక్. అయినప్పటికీ క్లైమాక్స్‌ ఇంపాక్ట్ ఉండటంతో.. ఆ లోటు భర్తీ చేసిందని కొందరు రివ్యూలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే..‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పాజిటివ్ ఆడియన్స్ టాక్ వినిపిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.