ఇడ్లీ : జెండా రంగులో ఇండ్లీ చేసి పెట్టండి. దీని కోసం ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. దానిని మూడు భాగాలు చేసుకోవాలి. తర్వాత ఒకదానిలో క్యారట్ ప్యూరీ, రెండవ దాంట్లో నార్మల్ పిండి, మూడవ దానిలో పాలకూర ప్యూరీ వేయండి. వీటిని దేనికి అది కలిపి , ఇడ్లీ పాత్రలో మూడు రంగులు దేనికి అది సపరేట్గా వేసి , ఉడికిన తర్వాత తీయండి. అంతే మూడు రంగుల్లో ఇడ్లీ రెడీ.
త్రివర్ణ శాండ్ విచ్ : దీని కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన పనే ఉండదు. అంతే కాకుండా పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు.అయితే దీనిని జెండా రంగులో చేయడానికి ముందుగా బ్రెడ్ తీసుకోవాలి. అందులో ఒక దానిపై టొమాటో సాస్ స్ప్రెడ్ చేయాలి. ఇంకో దానిపై పనీర్, మరొక దానిపై గ్రీన్ చట్నీ పెట్టుకోవాలి. దానిని పిల్లల టిఫిన్ బాక్స్‌లో పెట్టాలి.
ఉప్మా: దీని కోసం ఉప్మాను మూడు భాగాలుగా చేసి, అందులో ఒక భాగంలో క్యారెట్, మరొక దాంట్లో బఠానీలు, బాగా వేసి వేయించి మంచిగా ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి.
దోశ : దీని కోసం దోశ పిండిని మూడు భాగాలుగా చేయండి. తర్వాత అందులో ఒక దాంట్లో క్యార్ పేస్ట్, మరొకదాంట్లో పాలకూర పేస్ట్ కలపండి. ఈ మూడు రంగులను దోశల్లా వేసుకోండి. అంతే జెండా రంగులో దోశలు రెడీ.
జెండా రంగులో పరాఠా : దీని కోసం మందుగా పిండిని మూడు భాగాలుగా చేసుకొని, అందులో ఒక దాంట్లో క్యారెట్ పేస్ట్, మరొకదానిలో పాలకూర పేస్ట్ వేసి, మంచిగా చపాతి పిండిలా కలిపి పరాఠాను ప్రిపేర్ చేసుకోండి.




