Reading Time: < 1 minute

స్పా ముసుగులో వ్యభిచారం..సోమాజీగూడలో నిర్వాహకుడు అరెస్ట్

Caption of Image.
  • సోమాజీగూడ గ్లామరస్​ ఫ్యామిలీ సెలూన్ లో ఏడాదిగా నిర్వహణ

పంజాగుట్ట, వెలుగు: సోమాజిగూడలోని ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో స్పా ముసుగులో ఏడాదిగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందాను పంజాగుట్ట పోలీసులు బయటపెట్టారు. పక్కా సమాచారంతో ఈ నెల 12న సాయంత్రం సదరు అపార్ట్​మెంట్​లోని గ్లామరస్​ ఫ్యామిలీ సెలూన్ పై ఆకస్మికంగా దాడి చేసి, నిర్వాహకుడు ఎండీ.ఆఫ్తాబ్‌‌తో పాటు ఇద్దరు విటులను అరెస్ట్​చేశారు. నలుగురు బాధితులను(మహిళలను) రక్షించారు. 

నిర్వాహకుడు కస్టమర్ల వద్ద నుంచి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో భవన యజమాని మోహన్‌‌కు కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్తాబ్​వద్ద నుంచి రూ.4 వేలు, నాలుగు మొబైల్ ఫోన్లు, కండోమ్‌‌లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు లేవని, కస్టమర్ల రికార్డులు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. కాగా, మోహన్​పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు,

©️ VIL Media Pvt Ltd.