Reading Time: < 1 minute
Jojo First Look Deva Katta Presents A Raw Unfiltered Rural Rom Com

తెలుగు చిత్రసీమలో విభిన్నమైన మరియు వినూత్నమైన చిత్రాలను అందించే ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సమర్పణలో మరొక ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణ కమల్, మాహి శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి జోజోఅనే టైటిల్ ను ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

పల్లెటూరి వాతావరణం నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని పూర్తి రా అండ్ రస్టిక్ స్టైల్‌లో తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఎలాంటి మొహమాటం లేని, అన్‌ఫిల్టర్డ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే వినోదాత్మక చిత్రంగా ‘జోజో’ ప్రేక్షకులను అలరించబోతోంది. యంగ్ యాక్టర్స్ కృష్ణ కమల్, మాహి శ్రీల మధ్య రొమాన్స్ మరియు కామెడీ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్ రిలీజ్ చేసిన ‘మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి’ కాన్సెప్ట్ వీడియో వైరల్ గా మారింది.     సీరియస్ రూల్స్ పట్టించుకోకుండా, కేవలం వినోదాన్ని మాత్రమే కోరుకునే యూత్ మరియు మాస్ ఆడియెన్స్ కోసం ఈ సినిమాను రూపొందించినట్లు స్పష్టమవుతోంది.ఈ చిత్రానికి లీయో కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ కృష్ణ లింగం నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. గుళ్లపల్లి కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తదితర వివరాలు మరియు టీజర్ అప్‌డేట్‌లను విడుదల చేయడానికి మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు.