Reading Time: < 1 minute

సింగరేణి సెంట్రల్ వర్క్షాప్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేస్తాం: డైరెక్టర్ తిరుమల రావు

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి సెంట్రల్​వర్క్​షాప్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కంపెనీ ఈఅండ్​ఎం డైరెక్టర్​ తిరుమలరావు అన్నారు. గురువారం సెంట్రల్​వర్క్‌‌‌‌‌‌‌‌షాపును సందర్శించారు. వర్క్​షాపులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఫౌండ్రీ సెక్షన్, మెషిన్​షాప్, ఫ్యాబ్రికేషన్, క్వాలిటీ విభాగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్​వర్క్​షాప్​ సంస్థకు కీలకమైందన్నారు. ఆయన వెంట జీఎం రామ్మోహన్​రావు, అధికారులు వేలాద్రి, కేశవరావు, నాగేశ్వరరావు, వెంకటరాజు, నారాయణరావు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.