హిందూ సంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వివాహం నిశ్చయం అయినప్పటి నుంచి 16 రోజుల పండుగ పూర్తి అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక వివాహం సమయంలో తాళికట్టడం, జీలకర్ర బెల్లం పెట్టడం, కన్యాదానం మాత్రమే కాకుండా, వరుడు వధువు నుదుటిపై సింధూరం పెట్టడం కూడా ఒక అద్భుతమైన ఘట్టం, ఈ క్షణం వారి కొత్త జీవితానికి ప్రారంభంగా నిలుస్తుంది.
అయితే కొన్ని సార్లు వరుడు వధువుకు సింధూరం పెట్టే సమయంలో, కొన్ని సార్లు అది ముక్కుపై కూడా పడుతుంది. అయితే ఇలా ముక్కుపై కుంకుమ పడితే కొందరు భయపడిపోతుంటారు. దీనిపై అనేక ఆలోచనలు విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, భారతీయ జానప సంప్రదాయాలలో ఇది యాదృచ్ఛిక సంఘటన కాదంట, ఇది చాలా ప్రత్యేకమైనది, ముఖ్యంగా శుభ సూచకంగా భావిస్తారు.
ఎందుకు అంటే. ఇది వారి కొత్త జీవితానికి సానుకూల మార్పును సూచిస్తుందంట. జానపద కథల ప్రకారం, పెళ్లిలో పెళ్లి కూతురు ముక్కుపై కుంకుమ పడటం అనేది ఆమె భర్త తనను జీవితాంతం ఎక్కువగా ప్రేమిస్తాడంట. అంతే కాకుండా అలాంటి స్త్రీ అత్తగారింటిలో అందరి నుంచి ప్రేమ, ఆప్యాయతలను పొందుతుంది. రోజులు గడిచే కొద్ది వారి బంధం మరింత బలపడ, వారు చాలా ఆనందంగా జీవిస్తాంరట.
అంతే కాకుండా ముక్కుపై సింధూరం పడటం ప్రేమకు మాత్రమే కాకుండా ఇది లక్ష్మీదేవి ఆశీస్సులకు సంబంధించినది కూడా, ఎవరి ముక్కుపై అయితే కుంకుమ పడుతుందో, వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లేనంట. దీని వలన పెళ్లి కూతురు కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




