Reading Time: 2 minutes

గూగుల్ కంటే ముందుగానే…  ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసింది: సీఎం చంద్రబాబు 

Caption of Image.

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ( ఏప్రిల్ 27 ) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను విశాఖ వచ్చానని… 100 ఏళ్ల ఏయూ పండుగ ఒక చరిత్ర. మంగళవారం ( ఏప్రిల్ 27 ) ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మరో చరిత్ర అని అన్నారు. గూగుల్ కంటే ముందుగానే ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసిందని అన్నారు.

ఆర్థిక సంస్కరణలు వచ్చాక 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనమని.. 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని అన్నారు. విశాఖ విశ్వనగరం… గ్లోబల్ సిటీ. ఇది అన్ స్టాపబుల్…ఎవరూ ఆపలేరని అన్నారు. 100 ఏళ్ల చరిత్ర  ఒక బ్రాండ్ అని… రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ సమావేశం ఏయూలో నిర్వహించామని అన్నారు. అది ఏయూ ప్రత్యేకత అని అన్నారు.

53 యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉన్నాయని.. అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్ అని అన్నారు చంద్రబాబు. స్వాతంత్య్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చిందని… జైపూర్ రాజ్ విక్రమ దేవ్, గజపతి రాజవంశం, పిఠాపురం రాజవంశం, బొబ్బిలి రాజులు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారని… వారిని మనం స్మరించుకోవడం ధర్మం, బాధ్యత అని అన్నారు చంద్రబాబు. 

కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు మొదటి వీసీగా చేసి బలమైన పునాది వేశారని… ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసేనని.. నేనూ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొన్నానని అన్నారు చంద్రబాబు. 2వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ… దేశ రాష్ట్రపతి అయ్యారని… మన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారి తండ్రి సర్వేపల్లి అభిమాని అని… ఈయనకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టారని చంద్రబాబు.

ఎంతోమంది నాయకులను తయారు చేసిన గడ్డ ఏయూ అని… రాజకీయ ఉద్దండులు ఇక్కడ నుంచి వచ్చారని… వెంకయ్య నాయుడు ఏయూ నుంచే వచ్చారని అన్నారు చంద్రబాబు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచే వచ్చారని… ప్రపంచంలోని చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేస్తున్నారని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.