
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా మెట్రో రైల్ టైమింగ్స్ మార్చాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ సమావేశం సందర్భంగా ఈ రిక్వెస్ట్చేశారు. వందేభారత్, రాజధాని, తెలంగాణ ఎక్స్ప్రెస్వంటి రైళ్లన్నీ తెల్లవారుజామున 4.30 నుంచి 6.30గంటల మధ్య నగరానికి చేరుకుంటాయని, మెట్రోరైళ్లు ఉదయం 6 గంటల నుంచి నడుపుతుండడంతో ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లు ఆశ్రయిస్తూ నష్టపోతున్నారన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీకి రోజు 20 నుంచి 30వేల మంది వస్తారని, వీరికి అందుబాటులో ఉండేలా ఉదయం మెట్రోను నడిపిస్తే బాగుంటుందన్నారు. దీని గురించి గతేడాది సెప్టెంబరులోనే రైల్వే జీఎం లెటర్రాసినట్టు సమాచారం. అయితే, దీనిపై తప్పక ఆలోచిస్తామని, టెక్నికల్ఇబ్బందుల గురించి తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.