Reading Time: 2 minutes

రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ ధమాకా: పెద్ద బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో కింద పడ్డ పగిలిపోదు..

Caption of Image.

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ పాపులర్ ‘C’ సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్ రియల్‌మీ C81ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా తక్కువ ధరలో బిగ్ బ్యాటరీ బ్యాకప్, ధృడమైన డిజైన్ కోరుకునే వారి కోసం ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రియల్‌మీ C81 లాంచ్ పై పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం రియల్‌మీ C81లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో  6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. సాధారణ 60Hz బడ్జెట్ స్క్రీన్‌లతో పోలిస్తే, ఇది మరింత స్మూత్  స్క్రోలింగ్, ఫ్లూయిడ్ యానిమేషన్‌లను అందించే లక్ష్యంతో రూపొందించారు.  4GB RAMతో  యూనిసోక్ T7250 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా. 

రియల్‌మీ C81 లాంచ్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం దాని 6,300mAh బ్యాటరీ.  15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే,  హై బ్యాటరీ లైఫ్‌ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ MIL‑STD‑810H సర్టిఫికేషన్‌ కూడా పొందిందని  చెబుతున్నారు.  

స్టోరేజ్ అండ్ సాఫ్ట్‌వేర్
ఇండియాలో  రియల్‌మీ C81 4GB+64GB & 4GB+128GB  స్టోరేజ్ & ర్యామ్ అప్షన్ తో వస్తుందని చెబుతున్నారు. ఈ హ్యాండ్‌సెట్ గ్లేసియర్ బ్లూ ఆసియా, స్టార్మ్ బ్లాక్ ఆసియా కలర్ అప్షన్స్ లో లభిస్తుందని అంచనా.  

సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, రియల్‌మీ C81 ఆండ్రాయిడ్ 15 & రియల్‌మీ UIతో రానుంది. లాంచ్ సమయంలో ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ అప్‌డేటెడ్ ప్రైవసీ కంట్రోల్స్, సరికొత్త విజువల్స్‌ చూడొచ్చు. 

రియల్‌మీ నోట్ 80 రీబ్రాండింగ్‌కు అవకాశం
 ఇండోనేషియాలో విడుదలైన రియల్‌మీ నోట్ 80 ఫోన్‌ను ఇండియాలో రియల్‌మీ C81 పేరుతో విడుదల చేస్తున్నారని సమాచారం.  అలాగే, లీక్ అయిన C81 స్పెసిఫికేషన్లలో  8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, పెద్ద బ్యాటరీ, 6.74-అంగుళాల LCD ప్యానెల్‌తో సహా నోట్ 80 స్పెసిఫికేషన్లను చాలా దగ్గరగా ఉన్నాయి.

రియల్‌మీ C81 ఇండియా లాంచ్ అనేది బ్యాటరీ లైఫ్, మన్నిక, హై రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేకు ప్రాధాన్యతనిచ్చే, ఒక ఎంట్రీ-లెవల్ స్మార్ట్ ఫోన్  అని చెప్పొచ్చు. తక్కువ ధరలో మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ కావొచ్చు.

 

©️ VIL Media Pvt Ltd.