Reading Time: < 1 minute

హయత్‌నగర్‌ తొర్రూరు రంగనాథ స్వామి గుళ్లో దొంగలు పడ్డారు.. రెండు హుండీలు చోరీ

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్లోని హయత్‌నగర్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. తొర్రూరు రంగనాథ స్వామి దేవాలయాన్ని టార్గెట్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. దుండగులు రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ఇదే దేవాలయంలో మూడో సారి దొంగతనం జరగడం గమనార్హం. 

వరుస చోరీలతో భక్తుల్లో ఆగ్రహం, భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.