
టెహ్రాన్: అమెరికాను ఓడించేందుకు తమ నేవీ రెడీగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తెలిపారు. ఏ రకమైన దురాక్రమణనైనా తిప్పికొట్టే సామర్థ్యం ఇరాన్ కు ఉందని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన శనివారం తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శత్రువులకు కొత్త ఓటముల చేదును రుచి చూపించడానికి ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది.
ముఖ్యంగా హార్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో మా సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేవారిని ఎదుర్కోవడానికి, శత్రువులను మట్టికరిపించడానికి సన్నద్ధంగా ఉన్నాం.
ఇరాన్ నావికాదళం తన శక్తిసామర్థ్యాలతో అమెరికా దళాలను ఓడిస్తుంది. దేశానికి రక్షణ కవచంగా నిలుస్తుంది. శత్రువుల గర్వాన్ని అణచివేసేందుకు.. వారికి గట్టి గుణపాఠం చెప్పేందుకు మా వీర సైనికులు వేచి చూస్తున్నారు” అని పేర్కొన్నారు.