
అక్కినేని వారి పెద్ద కోడలు, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల రాజకీయ భావజాలంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్లామర్ ప్రపంచంలో ఉండే సెలబ్రిటీలు సాధారణంగా రాజకీయాలు లేదా వివాదాస్పద అంశాలపై మాట్లాడేందుకు అంతగా ఇష్టపడరు. కానీ, శోభిత మాత్రం తన మనసులోని భావాలను ఏమాత్రం దాచుకోకుండా నిర్మొహమాటంగా బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది.
అసలు ఏం జరిగింది?
నాగ చైతన్య వైఫ్, నటి శోభిత ధూళిపాళ్లకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె చేసిన పొలిటికల్ కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి. మీ గురించి ఓ సీక్రెట్ చెప్పమని యాంకర్ అడిగినప్పుడు.. తనకు కచ్చితమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయని, తాను లెఫ్ట్ లిబరల్ అని వెల్లడించింది. అంతేకాదు ఏదో ఒకరోజు కమ్యూనిజం గెలుస్తుందని కామెంట్ చేయడం మరింత ఆసక్తి రేకిత్తించింది. అయితే ఈ వ్యాఖ్యలు తాజాగా చేసినవి కావని, గతంలో ‘గూఢచారి’ సినిమా ప్రమోషన్ల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించినవిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో మళ్లీ వైరల్ కావడంతో శోభిత పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Actor Sobhita Dhulipala says, “I have a feeling communism is going to win someday.”
Yet her career, like many celebrities, is built on brand endorsements, designer collaborations, magazine covers, and the entertainment industry, all products of a market-driven economy.
People… pic.twitter.com/ZKXmgfvt2L
— BALA (@erbmjha) August 4, 2026
నెటిజన్ల నుంచి మిక్సెడ్ రియాక్షన్స్..!
శోభిత వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా స్పందిస్తున్నారు. కొందరు తన అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా వ్యక్తం చేసినందుకు ఆమెను ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తమ రాజకీయ, సామాజిక అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందని మద్దతు ఇస్తున్నారు. మరోవైపు విలాసవంతమైన సినీ పరిశ్రమలో ఉంటూ, లగ్జరీ లైఫ్‌స్టైల్ గడుపుతున్న నటి.. కమ్యూనిజం గురించి మాట్లాడటం పొంతన లేని విధంగా ఉందని విమర్శిస్తున్నారు.
ALSO READ : బ్రాండ్ వాల్యూలో ఆలియా భట్ టాప్.. వెనకపడ్డ దీపికా, రష్మిక మందన్న
ఇంకోవైపు, ఈ కామెంట్స్ కారణంగా శోభిత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇవి కేవలం ఆమె గతంలో వ్యక్తం చేసిన వ్యక్తిగత సిద్ధాంతపరమైన అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టమవుతోంది. ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉన్న శోభిత, ఈ వైరల్ వీడియోపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
మోడల్ నుంచి స్టార్ హీరోయిన్ వరకు
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుని సత్తా చాటింది. ‘రమణ రాఘవ్ 2.0’తో నటిగా ఎంట్రీ ఇచ్చిన శోభిత, ‘గూఢచారి’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘మంకీ మ్యాన్’ వంటి చిత్రాలతో స్టార్ డం సంపాదించుకుంది. అలాగే ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్లోనూ మంచి పేరు సొంతంచేసుకుంది.
ప్రస్తుతం శోభిత.. తమిళంలో తెరకెక్కుతున్న ‘వెట్టువమ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దర్శకుడు పా. రంజిత్ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆమె ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనుంది. ఇక జయం రవికి జోడీగా ‘వైట్’ అనే థ్రిల్లర్ సినిమాలోనూ శోభిత నటిస్తున్నట్లు సమాచారం. అట్లీ శిష్యుడు శ్యామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత జయం రవి, శోభిత కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.