
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు సానుకూల శక్తిని తీసుకొస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. డబ్బుకి లోటు ఉండదు. కేవలం ఇంటి నిర్మాణానికే కాదు.. మనం జీవితంలో ఎంతో పవిత్రంగా భావించే పర్స్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. పర్స్ ఎలా ఉండాలి.. ఎలా మెయిన్ టైన్ చేయాలి.. వాస్తు పండితుల సూచనలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
వాస్తు శాస్త్రం ప్రకారం పర్స్ వాడే విధం ఆర్థికశక్తిని ప్రభావితం చేస్తుంది. పర్సు చిందరవందరగా ఉంటే ప్రతికూల శక్తి గ్రహించి లక్ష్మీదేవి ఉండకుండా వెళ్లిపోతుంది. పర్సులో శ్రీ యంత్రాన్ని, లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచుకోవడం చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.
కొంతమంది పర్సులో పాతనోట్లు.. చినిగిన నోట్లు..అనవసర కాగితాలు పెట్టుకుంటారు. ఇలాంటివి అన్ని ఆర్థిక స్థిరత్వానికి ఆటంకం కలిగిస్తాయని వాస్తు సిద్దాంతం ద్వారా తెలుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే డబ్బు ఉంటుందని పండితులు చెబుతున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ( డబ్బు) ఉండే స్థలం.. పర్సు చాలా శుభ్రంగా ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే పర్సులో కొన్ని వస్తువులు అస్సలు ఉంచుకోకూడదని పండితులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం పర్సులో ఉండాల్సిన వస్తువులు
శ్రీ యంత్రం : ఇది పర్సులో ఉంటే వాస్తు ప్రకారం చాలా మంచిది. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి.. మెరుగైన ఆర్థిక అవకాశాలను కలుగుజేస్తుందిజ
ఎరుపు లేదా పసుపు రంగు కాగితం : పర్సులో ఎరుపు లేదా పసుపు చిన్న కాగితంపై శ్రీ అనే అక్షరాన్ని ఉంచుకోవాలి. శ్రీ అంటే సిరి.. సంపదలు అని అర్థం. పర్సులో ఇది ఉంటే అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి ఫొటో: పర్సులో చిన్నసైజు లక్ష్మీ దేవి చిత్రాన్ని ఉంచుకోవాలి. ఇది సంపద.. శ్రేయస్సుకు ప్రతీక అని పండితులు చెబుతున్నారు.
కరెన్సీ నోట్లు: డబ్బును ఎప్పడూ గౌరవంగా చూడాలి. పర్సులో నోట్లను చిందర వందరగా కుక్కడం.. అడ్డ దిడ్డంగా మడవడం వంటివి చేయకూడదు. వాస్తు సిద్దాంతం ప్రకారం.. ఒక క్రమంలో ఉంచుకోవాలి. ఎలా పడితే అలా పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు.
పూజ చేసిన వస్తువు: పర్సులో పెట్టుకొనేవిధంగా పూజ చేసిన వెండి నాణేన్ని మీ పర్సులో ఉంచుకోవడం వలన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.
►ALSO READ | ట్రాఫిక్ లైట్ల కథ: మనకు నాలుగో రంగు ఎందుకు అవసరం?
పర్సులో ఉండకూడనివి
- చిరిగిన కరెన్సీ నోట్లు
- పాత కాగితాలు
- అనవసరమైన బిల్లులు
- మరణించిన వ్యక్తుల ఫోటోలు
- అనవసరమైన వస్తువులు
- పాడైపోయిన వస్తువులు
- పనికిరాని కాగితపు ముక్కలు
పర్సు ఎలా ఉండాలి
- ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
- చిరిగిపోయినా.. బాగా దెబ్బతిన్నా వెంటనే మార్చండి
- డబ్బు తీసుకున్నప్పుడల్లా దాన్ని మర్యాదగా వాడండి
- పర్సును ఎప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంచుకోవద్దు
- నాణేలను, కరెన్సీ నోట్లను వేరువేరుగా భద్రపరచండి
- పర్సును క్రమం తప్పకుండా సర్దుకోండి