
భారతీయ సినీ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగంలో, ఒక వెలుగు వెలిగి, ఎన్నో కష్టాలను అనుభవించిన అందాల తార ఆమె. 1970వ దశకంలో ఆమె ఒక డ్యాన్సింగ్ సంచలనంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతే కాదు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ తో పాటు భారీ రెమ్యునరేషన్స్ అందుకొని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సిల్క్ స్మిత కంటే ముందే ఆమె సినీ రంగంలో తనదైన ముద్ర వేసి, స్టార్ హీరోలను మించిన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమె పేరు కేవలం ఒక నటిది కాదు, అదొక బ్రాండ్‌గా ఇండస్ట్రీలో నిలిచింది. ఆమె తన డాన్స్ తో ఆ రోజుల్లో థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి అందాల తార జ్యోతి లక్ష్మి. జ్యోతి లక్ష్మి దాదాపు 20 ఏళ్ల పాటు తన నృత్యంతో సినీ లోకాన్ని ఏలారు. తెలుగు సినిమా ప్రత్యేక గీతాలకు తొలి అడుగులు నేర్పిన ఘనత ఆమెకు దక్కింది.
ఇది కూడా చదివేసేయండి : స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు
1944లో కూండుక్కిలి చిత్రంతో బాలనటిగా పరిచయమయ్యారు. 1963లో ఎంజీఆర్ హీరోగా నటించిన పెరియా ఇనత్తు పెన్ చిత్రంతో జ్యోతి లక్ష్మి పేరుతో తెరపైకి వచ్చి అదే పేరుతో కొనసాగారు. 1967లో పెద్దక్కయ్య ఆమె తొలి తెలుగు చిత్రం. శోభన్ బాబు నటించిన ఇదా లోకం సినిమాలోని గుడి వెనక నా సామి గుర్రం ఎక్కి కూర్చున్నాడు పాట ఆమెకు భారీ హిట్ ఇచ్చింది. అప్పటి నుండి జ్యోతి లక్ష్మి స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరాల నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు అనేక ప్రముఖ నటులతో కలిసి నటించారు. 300కు పైగా చిత్రాల్లో 1000 పాటలకు పైగా నృత్యం చేసిన ఆమె, తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళీ, హిందీ చిత్రాల్లోనూ నటించి ప్రజాదరణ పొందారు. వ్యక్తిగత జీవితంలో ఆమె ఎన్నో అవమానాలను, సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక్కసారి అద్దె ఇంటి కోసం చెన్నై మొత్తం తిరిగినా, మీలాంటి డ్యాన్సర్‌లకు మేము ఇల్లు ఇవ్వం అని మొహం మీదే చెప్పేశారట. ఇలాంటి సంఘటనలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి.
ఇది కూడా చదివేసేయండి : ఇండియాలోనే తోప్ హీరోయిన్.. వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..
వ్యక్తిగత జీవితంలోనూ జ్యోతి లక్ష్మి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు 1970వ దశకంలో తమిళనాడులోని మన్నార్‌గుడికి చెందిన వాసుదేవన్‌ను వివాహం చేసుకున్నారు. వాసుదేవన్‌కు అప్పటికే భార్య ఉన్నప్పటికీ పిల్లలు లేరు. అతని తల్లి ఆదేశం మేరకు జ్యోతి లక్ష్మి అతని భార్య అయ్యారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో వారి వివాహాన్ని రహస్యంగా ఉంచి సహజీవనం చేశారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా కూతురు మీనాక్షిని కన్నారు. అయితే ఈ ఎనిమిదేళ్లు వాసుదేవన్ ఆమెను తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తన కారణంగా ఆమె కొన్ని సినిమాలు కూడా కోల్పోయి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఆమె చెల్లెలు జయమాలిని సినీ రంగ ప్రవేశం చేసింది. వాసుదేవన్ బారి నుండి తప్పించుకునేందుకు ముంబై పారిపోయిన జ్యోతి లక్ష్మి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. వాసుదేవన్‌తో సంబంధం లేదని ప్రకటించిన తర్వాత ఛాయాగ్రాహకుడు సాయి ప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు.చివరికి, జ్యోతి లక్ష్మి 2016 ఆగస్టు 9న 63 సంవత్సరాల వయసులో బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.
ఇది కూడా చదివేసేయండి : తండ్రి స్టార్ క్రికెటర్.. భర్త బడా ప్రొడ్యూసర్..! ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్
Jyothi Lakshmi
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.