Reading Time: < 1 minute

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఈవీ ఇండస్ట్రీలో 4 కోట్ల జాబ్స్

Caption of Image.
  •  వెల్లడించిన అడెక్కో రిపోర్ట్

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్​ వెహికల్స్​(ఈవీలు) ఇండస్ట్రీ 2030 నాటికి నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అడెక్కో ఇండియా రిపోర్ట్​ వెల్లడించింది. ఏటా నియామకాలు 15 శాతం నుంచి 20 శాతం వృద్ధి చెందుతాయి. ఇంజనీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ నిపుణులకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రిక్​ ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ ఫ్లీట్స్, టూ-వీలర్స్ భారీగా అమ్ముడవుతున్నాయి.  

ఈవీలకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీలో 55 శాతం దాకా డిమాండ్ ఉంది. హోసూర్, సానంద్, ధోలేరా వంటి టైర్-2, టైర్-3 పారిశ్రామిక కారిడార్లలో కూడా పెట్టుబడులు వేగంగా విస్తరిస్తున్నాయి. గిగాఫ్యాక్టరీలు, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా చొరవతో ముడి చమురు దిగుమతుల భారం తగ్గుతోంది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్య సాధనకు ఈ రంగం ఎంతగానో తోడ్పడుతుందని రిపోర్ట్​ వివరించింది.
 

©️ VIL Media Pvt Ltd.