Reading Time: < 1 minute
Lokesh Kanagaraj Acting Debut Dc Director Arun Matheswaran Interview

Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఆగస్టు 7న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘డీసీ’ వైల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ అని, లోకేష్ కనగరాజ్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అన్నారు. సినిమా ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్ కనగరాజ్‌ను తన సినిమాలో హీరోగా ఎలా ఒప్పించారో చెబుతూ.. “నేను ఎప్పటినుంచో చెప్పాలనుకున్న కథ ఇది. ఒక పార్టీలో లోకేష్‌ని కలిశాను. ఈ ఆలోచన ఆయనకు చెప్పి, మనిద్దరం కలిసి చేస్తే బాగుంటుందని అన్నాను. ఆయనకు కథ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇది ఒక గ్యాంగ్‌స్టర్ కథ. తన ప్రయాణంలో చంద్ర, పార్వతిని కలుస్తాడు. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలా సాగుతుంది అనేదే సినిమా” అని చెప్పారు. “లోకేష్ గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్. నేను కథ చెప్పిన వెంటనే ఆయనకు బాగా నచ్చింది. అయితే అప్పటికి ఆయన ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. నేను కూడా ఇళయరాజా బయోపిక్ పనుల్లో ఉన్నాను. నా ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ఆయన కూలీ తర్వాత ఫ్రీ అయ్యారు. అలా ప్రాజెక్ట్ మొదలుపెట్టాం హీరోగా ఇది లోకేష్ గారికి తొలి సినిమా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు” అని లోకేష్ కనగరాజ్‌ను కొనియాడారు.